Arunachalam - Mantra Sadhana - Giri Pradakshina

తిరుఅణ్ణామలైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడంవలన కొండను చుట్టు ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానమయినది. ఈ నాటికీ కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగపురుషులు ప్రతి రోజూ తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు.#arunachalamgiripradakshina #arunachalam ఈ భూలోకములో అనేక ప్రదేశములలో గిరి ప్రదక్షిణ విధానము ఉన్ననూ రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగ ప్రాముఖ్యం పొందెను. ఒకటి హిమాలయాలయందు కైలాస గిరి ప్రదక్షిణము; మరొకటి తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం. టిబెట్ దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుచున్న ‘లామాలు’ (అనబడు గొప్ప యోగులు సిద్ధులు నేటికీ భౌతిక శరీరముతో శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్ననూ, ఆధ్యాత్మిక సూక్స్మ శరీరముతో తిరుఅణ్ణామలై ప్రదక్షిణముకూడ చేస్తున్నారు.#arunachalamgiripradakshina #arunachalam ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులును, నక్షత్ర దేవతలును తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేయుచున్నారు. క్రిములు, జంతువులు, వృక్షములు, కీటకములు మొదలగు ప్రతియొక్క జీవరాసులకుగాను తత్సంబంధిత దేవతలు వారి జాతియొక్క బాగు కోరి తిరుఅణ్ణామలైని ప్రదక్షించుచున్నవి.#arunachalamgiripradakshina #arunachalam శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతార మూర్తులుకూడ ఏదో ఒక రూపములో ప్రతిరోజు గిరి ప్రదిక్షిణము చేస్తున్నారు. శ్రీ అంగవ మహర్షి తన 10000 శిష్యగణముతో దట్టగాలీ ప్రదక్షిణ మార్గములో అనేక కోటి యుగాలుగ గిరి ప్రదక్షిణము చేస్తూనే ఉన్నారు.#arunachalamgiripradakshina #arunachalam తిరుఅణ్ణామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగ పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు ! గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్య లోక వాసులుకూడా తిరుఅణ్ణామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో, లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారు ‘మనము ఒంటరిగ వెళ్తున్నాం !’ యని చింతయో, భయమో పడునవసరం లేదు ! #arunachalamgiripradakshina #arunachalam ఈ అరుణాచలము అన్నింటికి మూలమగుటచేత ప్రతియొక్కరు చివరకు ఇక్కడకు రావలసినదే. పార్వతి కూడా శివునిలో ఐక్యమగుటకు ఇక్కడకు వచ్చి తపమాచరించి, ప్రదక్షిణ చేసింది. గౌరీ దేవి ఆజ్ఞానుసారం దుర్గ భక్తుల కష్టాలను తొలగించుటకు మరియు భక్తులు ఇష్టదేవతలను దర్శించుటకు తగిన శక్తినిస్తూ ఇక్కడే వుండిపోయింది రాజులు, దేవతలు, రాక్షసులు మున్నగు వారందరూ గిరిప్రదక్షిణ చేసి తమతమ పాపాలను పోగొట్టుకొన్నారు. ఈ శోణాద్రితో పోల్చదగినదంటూ లేనేలేదు. అరుణాచలమును దర్శించాలని తలచినంతనే వారి పాపకర్మలను నిర్మూలించి అరుణాచలుడు వారిని అనుగ్రహిస్తాడు. ఆయనుగ్రహముతో వారిలో అరుణాచలున్ని దర్శించాలనే ఆకాంక్ష రోజురోజుకు ఎక్కువై చివరకు వచ్చి అరుణాచలున్ని దర్శిస్తారు. ఆయన కరుణకు పాత్రులై పవిత్రులవుతారు. మానవులను ఉద్ధరించుటకు ఈ ధరణిలో వెలసిన పరమశివుడే అరుణాచలము. లోకాలలో నిండియున్న పాపభూయిష్టత అంతా ఆ కొండచూపుతో తొలగిపోతుంది. ఈ పరమార్ధాన్ని “అరుణ” అనే పేరు తెలుపుతుంది. ఋషులు, సిద్ధులు, గంధర్వులు తరచుగా కైలాసపర్వతాన్ని వదలి ఇక్కడకు వచ్చి ఈ కొండను పూజిస్తారు. ఈ స్థలములో చేయు పూజలు, యజ్ఞగాయాలు, జపతపాలు తొందరగా ఫలిస్తాయి. కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయి. ఈ శిఖరము వైపు చూచినంత మాత్రాన పాపములు నశించుటే గాక జ్ఞాననేత్రము విప్పారుతుంది. లోచూపు ఏర్పడుతుంది. అరుణా చలుని చూచినంత మాత్రాన చెడుతలంపులు, చెడుమాటలు, చెడుదేహమంతా తొలిగిపోతుంది. గిరిప్రదక్షిణ చేసినవారి పాపాలను, సాష్టాంగ దండ ప్రణామములు చేసినవారి పాపాలను, పుష్పాలను అర్పించే వారి పాపాలను, భక్తితో ప్రస్తుతించే వారి పాపాలను ఈ అరుణగిరి సమూలంగా తొలిగిస్తుంది. ఇంద్రాది దేవతలు మరియు గౌరి కూడా పాపములు పోగొట్టుకొనుటకు అరుణాచలములో తపము చేయవలసినదే యని పరమేశ్వరుడు శాసించియున్నాడు. ఇతర పుణ్యక్షేత్రాల కంటే ఈ అరుణాచలములో ఎట్టి తపము చేసినా సత్వరంగా ఫలితమునిచ్చును. తుమ్మునప్పుడు, లేదా సంతోషసమయాలలోను, లేదా పొరబాటున క్రింద పడబోవునపుడును కొందరు తెలివైనవారు "అరుణాచలా!" అని అనడం జరుగుతూ ఉంటుంది. అట్టివారి మనస్సును అరుణాచలుడు పవిత్రం చేయగలడు. అరుణాచలుని చూచినంతనే కళ్ళు శుద్ధమగును. ఆయనను గూర్చి మాట్లాడినంతనే నాలుక పవిత్రమగును. స్మరించినంత మాత్రాన మనస్సు శుద్ధమగును. సర్వవ్యాపకుడైన పరమాత్మయే ఈ అరుణాచలుడు.#arunachalamgiripradakshina #arunachalam ఏదిఏమైనా పరమేశ్వరుని అవతారమే ఈ అరుణాచలమని శివపురాణాలన్నీ చెబుతున్నాయి. అంతేకాదు చాలామంది సాధువులు, కవులు తేజస్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించిన విధమును మనోహరంగా తమ కవితల్లో స్తుతించారు, పాడారు. అందుచే అరుణాచల ప్రాదుర్భావము కల్పితమని ఊహించుటకు వీలుకాదు. ఇది సర్వులూ నమ్మదగిన విషయము. సత్యమైన సంఘటన. అందుచేత ఈ సృష్టిలో అరుణాచలముతో సమానమైనది మరేదియునూ లేదు. ఈ లోకములో ఎందరో జ్ఞానులు, అవధూతలు, సిద్ధపురుషులు ఉండవచ్చు. కానీ వారు ఆయనతో సమానమని చెప్పవీలులేదు. అట్లు చెప్పడము శుద్ధతప్పు. అరుణాచలునితో సమానమని తలంచడమే గొప్ప అజ్ఞానము. ఆయన నిరంతరము ప్రకాశించే అవధులులేని జ్యోతిస్తంభము. అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలము. భక్తితో, నమ్మకముతో పూజించేవారు బ్రహ్మవిష్ణువులు చూచిన జ్యోతిస్తంభాన్ని ఈ కొండలో ఇప్పటికినీ చూడగలరు. చూస్తున్నారు కూడా. భగవాన్ శ్రీరమణమహర్షులు అరుణాచలాన్ని గూర్చి ఈ విధంగా హెచ్చరిక చేశారు. "ఈ అరుణాచలాన్ని ఊరక ' చూచి, వెంటనే యిది రాళ్ళతోను, గుండ్లతోను, చెట్లూచేమలతోను కూడిన సాధారణ పర్వతమని మాత్రము భావించకండి. ఇది పరమేశ్వరుని స్వరూపము”. దీనిని నిర్ధారించుటకు భగవానులు జ్ఞానసంబంధర్ వ్రాసిన తేవారాన్ని పేర్కొనేవారు. అందులో ఏమీ తెలియని పిల్లవాడు అరుణాచలాన్ని చూచి, "ఇది మహనీయమైన జ్ఞానస్వరూపము పరమేశ్వరుని అనంతమైన కరుణయే ఈ అరుణాచలము” అని అన్నాడట. ఈ విషయాన్ని శ్రీరమణ భగవానులు భక్తులకు చెప్పేవారు. తిరుఅణ్ణామలైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడంవలన కొండను చుట్టు ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానమయినది. ఈ నాటికీ కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగపురుషులు ప్రతి రోజూ తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. #arunachalamgiripradakshina #arunachalam
Poojanilayam