కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి కలిగి ఉంటుంది. “కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి” అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీ కృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలో ముందు నీకొచ్చిన సందేహం ఏంటి అంటారా? ఈ కస్తూరి అనేది తిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని. పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది. మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి.
 
“చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం   సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్యవస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం” అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో అలంకరింపబడినవాడు, మల్లె మాలలను ధరించినవాడు, గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం
సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది! “కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె” అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే ప్రథమ స్థానం. కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది. 
 
ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి కస్తూరి అనేది అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు! పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలన కృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు. కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.) యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము. కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి
ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా
మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం. ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట. ప్రత్యుత్పత్తి కాలంలో (మే – జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.దీనిని టిబెట్, చైనా, తదితరప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు.
కృత్రిమంగా వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి) అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్. దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన
యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట. అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు, సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము
చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన జింక కస్తూరిని కలుపుతారో తెలియదు! సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి
గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి కస్తూరి రకములు.ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది. ఎలా అంటే:౧. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలో నూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగా వాడుతున్నారు.౨. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకి
వాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటినొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరి రసం పట్టించేవారు.౩. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనే దీనిని తాంబూలంలో కలిపి తింటారు.౪. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట,బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికి ఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు. ౫. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగ నాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్ని తగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదా చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషి
బ్రతుకుతాడని నమ్మిక. ౬. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ, నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికి ఇది చక్కని మందు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యమయినవి మాత్రం ఇక్కడ పెట్టాను. కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు. శ్రేష్టమయిన పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయిన కుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు. కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా? ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో తారసపడుతుంది.
 
“మృగ మదంబు చూడ మీ(ద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!”
 
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచి వాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకి ఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును. దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది దీని నీతి.
 
“కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!”
 
“గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!”
 
వీటిని నేను ప్రత్యేకంగా వివరించ వలసిన అవసరము లేదనుకుంటాను. అంత సరళమయిన భాష వాడారు. అందులోని అంతరార్థం మీ ఊహకే వదిలేస్తున్నాను! అంతే కాకుండా కస్తూరిని తిలకదారనలోను,పండుగలు విశేష కార్యక్రమాలలో దేవుళ్ళకు అభిషేకం లోను వాడుతారు.ఈ సుగంధద్రవ్యం ప్రత్యేక సువాసనే కాదు ప్రతేక ఆకర్షణని కూడా కలిగి ఉంటుంది. కస్తూరిని ఆరోగ్యం ,అభిషేకం,పూజ ,హోమం మొదలైన వాటిలో వాడుతారు
 
 
 
Musk deer has the gland that produces the musk. “Kasturi Tilakam Lalata Falake” Vakshasthale Kaustubham Nasagre Navamuktikam The work is the flute that cuts the bracelet Lord Hari sandalwood cha kalayam With the presence of Kantecha Muktavaleem Gopastri Victory is Gopala Chudamani” Everyone learnt this in childhood Sri You would have praised Krishna right! At that time of the year The doubt that came to you first What do you say? This musk is what it is
Name of Tilakam? Or Tilakanna is called Kasturi? That is a tilakam Is it the ornament he uses instead? What is the meaning of musk? Just like that. It is mentioned in ancient times and in mythology too There is. Among them it is for decoration and perfume. It is said that it has been used in different ways for health and homala. As far as we know or have heard this Most of the mention is heard from Krishna only but this Check it out.
 
“Scaru Kampaka Varnabham Hyeka Vaktram Trilochanam” The happiness of Eeshadhasya is a gem of gold Malathi Malayuktham Sadratna Mukutojjval
Satkanta ornament Charu Valayangada Bhushitam Twathi Sukshena Charuna is priceless Vastra Ugmena Vichitrenati Rajitham Chandanagar Kasturi Charu, Saffron, Bhusitam Gem The hand of mirror is shining in flames” With a beautiful treasured light like meni The one who shines, the one-faced, the three The one with eyes, the cheerful one with a smile The one with the face, with the gold jewels The one who is adorned, the one who wears jasmine garlands, The crown adorned with great jewels, The one who wears a nice necklace, lovely The one who is adorned with bangles and anklets, Knitted with a thin thread that shines like a flame The one who shines with a pair of coloured clothes, With sandalwood, agaru, musk and good saffron The one who is adorned, is a jewel born
The one who is in the hand, the eyes were closed with a bite The meaning of marriage is that Siva who is rich In Shiva Puranam, he went away as a decoration of all kinds. It has been said. Isn’t this such a gorgeous color! Just a few of the best things you can do. Shiva also listens to Kasturini in Krishna’s decoration
This verse shows that it has been used!
 
“Kasturi Tilaka will scold you and tie your legs Kashi Peetambara’s son, you are the light of the eyes. Even in that Vishnu’s bhajan also, there is Kasturi First place. Kasturini to Saturn and Rahu planets; Rohini, Moola, Bharani stars under homadra It is said in Sri Vishnu Dharmottara Purana that we should use it.
And the musketeers roaming the island Always searching for fragrances Manidweepa description is also there in (Devi Bhagavatam). Some more about Kasturi, which plays a major role in all these Let’s get things in the know. Muscle is actually what it is One of the most expensive animal products. The price in Kasturiki is almost two and a half lakh rupees! Until the late nineteenth century it was naturally Because of the many uses of preparedness This is also being made artificially. Musk Sanskrit is the English name for Kasturiki The tenth Mushka arises from (vrushanalu). This is a male Muschiferus deer (Moschus moschiferus L.  Between the abdomen and the penis The fragrance that emanates from a particular gland. Deer all this gland to get musk Will be separated from the body. Well grown up, I’m so proud of you. Forty percent musk in a healthy gland There will be. Due to too much drying this gland In the dark red color hidden in it The existing musk turns black. Like this When it changes it means it’s ready for use. By the way, this male deer is Kasturi and female deer
It’s getting ready to impress. High percentage in the post production period (May – June) Scientists say that it removes musk Told y’all. It is mostly made in Tibet, China, and other regions. Artificially These are being made in bulk. That other one Related fragrances also kasturi (dhavala kasturi) This is called as. But most of these are real From chemicals that are different from musk Might as well have been the product. Except for the musk deer lands of other animals, musketeers The extracts of many plants that exude a similar aroma, this is the Kasturi is also the artificial ingredients that have smell The people are thinking. That natural ready in kasturi Muscon is the organic compound that is the main reason for the odor. Guess the main flavor of this one Europeans use it in making perfumes. Not only that, because of its fragrance, it is the agarubattulu, Sambrani gives money in the name of Kasturi for everything Getting it done. True as far as it is Don’t know if deer musk is involved! Saranga navel, Kuranga nabi, deer pokkili, enamadamu, itti Gorozanam, Sahasravedi, Lata, Modi, etc.
Types of musk. Kasturi is a prominent character in Ayurveda also Nourishing is the best. How to be like: Bored. For a long time Kasturi tablets in Tamal leaf juice Mixing it with honey as a medicine for cold and cough Using it. Bored. Musk is more for pain in pregnant women Will use it. Arthritis pains go away, that’s Puriti Kasturi says if there are pains, there will be relief. The ones who suck the juice. Bored. Musk is a wonderful medicine for arthritis. That’s why This is eaten together in tamboolam. Bored. Indigestion, constipation, excessive sweating, Childish body aches and vomiting etc This is the name that has been kept. Not with honey but with ginger juice Will be caught on the sledge. Bored. Saranga if the body cools down before the death of a man If you touch Nabi Kasturi, you will get hot (and vomit) It is obvious that they are used to reduce it. Says it reduces the cold and increases the heat! ) man The faith that he will live.
Bored. Heart diseases, diarrhea, asthma, asthma, For nerve weakness, archery, paralysis, etc. This is the good medicine. There are many if we keep on saying like this but Just gonna put the important ones here. Kasturi There is another name for excellence. The best of the best Yellow musk turmeric is the best
Saffron is known as Kasturi Kumkuma. Will our poets leave Kasturi? Especially in the Vemana century for us in the following poems
Staring at it.
 
“Look at the beast’s nest, your (the black one)
The rainbow is its fragrance
Leelagura is the quality of teachers
Vishwadabhirama Vinuravema! “
 
Even though Kasturi looks dark, it is good in any way Stinks are out the same way the greats are out Even if there is no luxury, there will be great power. Don’t be fooled by the color or shape of anything The moral of this is.
 
“baby it smells like mussels”
The old woman’s menu is a stigma
Can I describe the age?
Vishwadabhirama Vinuravema! “
 
“The smell of the musk of Garth Bambaruguna
Let the rest be spoiled
Come on whores for the new religions
Vishwadabhirama Vinuravema! “
 
I need to explain these in particular I don’t think so. Such simple language used. I leave the implications to your imagination! Not only that, Kasturi is used in Tilakadharana, festivals and special programs as well as in Abhishekam to Gods. This perfume not only has a special fragrance but also has a special attraction. Kasturi is used in health, anointing, pooja, homam etc.
Poojanilayam